పూజలు చేస్తుండగా బాంబులతో దాడి

కలం, వెబ్​ డెస్క్​: బంగ్లాదేశ్​లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ హిందువుల మీద దాడులు ఆగడం లేదు(Bangladesh). తాజాగా పూజలు చేసుకుంటున్న హిందువులపై దాడి జరగడం దీనికి నిదర్శనం. బంగ్లాదేశ్​లోని కొమిల్లా ప్రాంతంలో పూజలు చేసుకుంటున్న హిందువులపై దుండగులు బాంబులు విసిరారు. దీంతో పలువురు గాయపడ్డారు. బాంబులు పేలడంతో సమీపంలోని ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

ఈ ఘటనలో పూజారి కేశ్​ చక్రవర్తి తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు(Bangladesh). కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, నిరుడు బంగ్లాదేశ్​లో ఇంక్విలాబ్​ మాంచో సంస్థ నాయకుడు ఉస్మాన్​ హాదీ హత్య తర్వాత భారత వ్యతిరేక అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. వీటిని అడ్డుకోవాల్సిన​ అప్పటి యూనస్​ సారథ్యంలోని ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ అల్లర్లో పదుల సంఖ్యలో హిందువులు హత్యకు గురయ్యారు. ఇటీవల బంగ్లాదేశ్​ పార్లమెంట్​కు ఎన్నికలు జరిగి తారిఖ్​ రహ్మాన్​ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడింది. అయితే, హిందువులపై దాడులు మాత్రం ఆగడం లేదని ఈ సంఘటనతో అర్థమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>