కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా నందిపేట్ (Nandipet) మండల కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. స్థానికంగా ఆడుకుంటున్న పిల్లలు.. పసి పాప ఏడుపు గమనించి విషయం కొందరికి చెప్పడంతో యువకులు ఆడ శిశువును గుర్తించారు. వెంటనే స్పందించి పాపను చికిత్స నిమిత్తం సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో శిశువు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శిశువును ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేప ఇదే..
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

