Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేప ఇదే..

కలం, వెబ్ డెస్క్: చేపల్లో ఎన్నో రకాలు. కొన్ని వందలు, వేల సంఖ్యలో ఉంటాయోమో. అయితే ప్రపంచంలోనే అరుదైన చేప మాత్రం యూఎస్‌లో ఉంది. ఇప్పుడు ఈ చేప జాతి ఉనికి ప్రమాదంలో పడిందని తెలుస్తోంది. ‘డెవిల్స్ హోల్ పప్‌ఫిష్’ (Devils Hole Pupfish) ప్రపంచంలోనే అత్యంత అరుదైన చేప. ఈ చేపలు ఒక్క చిన్న గుహలో మాత్రమే జీవించగలవు. ఇటీవలి లెక్కల ప్రకారం వాటి సంఖ్య కేవలం కొన్ని డజన్లకే పరిమితమైంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నెవాడా రాష్ట్రంలోని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్‌లోని ‘డెవిల్స్ హోల్’ అనే లైమ్‌స్టోన్ గుహలో మాత్రమే ఈ చేపలు వేల ఏండ్లుగా జీవిస్తున్నాయి.

ఈ గుహ ప్రత్యేకత ఏమిటి?

ఈ గుహలోని నీటి ఉష్ణోగ్రత స్థిరంగా 92 డిగ్రీల ఫారెన్‌హీట్‌గా ఉంటుంది. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ చేపలు (Devils Hole Pupfish) ఇక్కడ జీవిస్తుండటం గమనార్హం. ఈ చేపలు పరిమాణంలోనూ చాలా చిన్నవి, సాధారణంగా 1 ఇంచి (2.5 సెం.మీ) కంటే తక్కువ పొడవు ఉంటాయి. వీటి ఆహారం గుహలో ఏర్పడే ఆల్గీలు, చిన్న అకశేరుకాలు. ఇటీవలి భూకంపాల కారణంగా గుహలోని స్పానింగ్ షెల్ఫ్‌పై ఆల్గీలు తొలగిపోవడంతో ఈ చేపల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2025లో నిర్వహించిన లెక్కల ప్రకారం కేవలం 38 చేపలు మాత్రమే మిగిలాయి. అయితే, ఈ చేపలను సంరక్షించే చర్యలలో భాగంగా క్యాప్టివ్ బ్రీడింగ్ నుంచి చేపలను విడుదల చేయడంతో సంఖ్య కొంత మెరుగుపడి 77కి చేరుకుంది. ఇది ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత తక్కువ సంఖ్యలో ఉన్న వెర్టిబ్రేట్ జాతుల్లో ఒకటి.

ఏమిటీ క్యాప్టివ్ బ్రీడింగ్

అంతరించి పోతున్న జాతులను సంరక్షించేందుకు ఈ ప్రక్రియలో సంతానోత్పత్తి చేస్తారు. అడవిలో లేదా సహజ వాతావరణంలో జీవించే జంతువులను అక్వేరియం లేదా ప్రత్యేక బ్రీడింగ్ ఫెసిలిటీల్లో కృత్రిమంగా సంతానోత్పత్తి చేస్తారు. శాస్త్రవేత్తలు ఈ జాతిని కాపాడటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి పెంచడానికి ప్రయత్నించినా, జన్యు వైవిధ్యం తక్కువగా ఉండటం వల్ల సఫలం కావడం లేదు. యునైటెడ్ స్టేట్స్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్, నేషనల్ పార్క్ సర్వీస్ వంటి సంస్థలు దీని రక్షణకు నిరంతరం కృషి చేస్తున్నాయి.

ఈ చేపలు ప్రపంచ జీవవైవిధ్యానికి ఒక అపూర్వమైన ఉదాహరణ నిలుస్తున్నాయి. వాతావరణ మార్పులు, భూకంపాలు, నీటి స్థాయి తగ్గడం వంటి సమస్యలు దీని ఉనికిని మరింత ప్రమాదంలో పడేస్తున్నాయి. పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ జాతిని కాపాడడం ద్వారా మన గ్రహం మీద జీవులు ఎంత సున్నితంగా సమతుల్యతను నిర్వహిస్తాయో మరోసారి గుర్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

Read Also: కాక్రోచ్ జనతా పార్టీపై సుప్రీంకోర్టులో పిటిషన్

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>