మణుగూరులో అమానుషం.. గొడ్డలితో ఎద్దుపై దాడి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండల కేంద్రంలోని పీకే-1 సెంటర్‌లో శుక్రవారం ఒక మూగజీవిపై కిరాతక దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా గొడ్డలితో దాడి (Bullock Axe Attack) చేయడంతో ఒక ఎద్దు తీవ్రంగా గాయపడింది. ​ఈ అమానుష ఘటనపై సమాచారం అందుకున్న బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రమేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన పశువైద్యాధికారి డాక్టర్ సరస్వతికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

​విషయం తెలుసుకున్న పశు వైద్య సహాయకులు వీరభద్రం, బాలకృష్ణ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఎద్దుకు తక్షణ వైద్య సహాయం అందించి చికిత్స చేశారు. సకాలంలో స్పందించి చికిత్స అందించిన డాక్టర్ సరస్వతికి, వైద్య సిబ్బంది వీరభద్రం, బాలకృష్ణలకు లింగంపల్లి రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ​మూగజీవిపై ఈ రకంగా అకారణంగా దాడికి పాల్పడిన కిరాతకుడిని వెంటనే గుర్తించి, చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>