Mobile Popup Ad
Mobile Popup Ad

ఐదు మండలాలకు కొత్త తహసీల్దార్లు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఐదు మండలాలకు కొత్త తహసీల్దార్లను(New Tahsildars) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇల్లందు మండలానికి కే. సూర్యనారాయణను, అశ్వపురం మండలానికి జీ. సూర్యప్రకాశ్‌ను, అశ్వరావుపేటకు డీ. కిషోర్‌ను, పినపాక మండలానికి జీ. శ్రీనివాస్ రెడ్డిని తహసీల్దార్లుగా నియమించారు. అలాగే బీ. సంధ్య రాణిని ఆళ్ళపల్లి మండలానికి డిప్యూటేషన్‌పై పంపించారు.

ఈ నియామకాలలో భాగంగా సూర్యనారాయణ, సూర్యప్రకాశ్, శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు బదిలీ అయ్యారు. జనాభా గణన, ఓటర్ల జాబితా సవరణ వంటి కీలక పనులను దృష్టిలో ఉంచుకుని పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) ఈ పోస్టింగ్‌లు ఇచ్చినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>