టాటూ వేయించుకుంటున్నారా..? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ ఫ్యాక్ట్స్

కలం, వెబ్ డెస్క్: ఈతరం వారికి టాటూలు (Tattoos) వేయించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అయితే వీటి వల్ల కంటి చూపు (Eye Disorders) దెబ్బతినే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా టాటూ అసోసియేటెడ్ యువెయిటిస్ (Tattoo-associated uveitis) అనే అరుదైన సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. కంటి మధ్య పొర యువెయా వాపుకు గురవ్వడం వల్ల కంటి నొప్పి, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయట. సకాలంలో చికిత్స తీసుకోకపోతే గ్లాకోమా, క్యాటరాక్ట్ వంటి సమస్యలతోపాటు అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఆస్ట్రేలియాలో 2023 నుంచి 2025 మధ్య కాలంలో నిర్వహించిన అధ్యయనంలో సుమారు 40 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధన ప్రకారం.. వ్యాధి బారిన పడిన చాలా మందిలో రెండు కళ్లు వాపుకు గురయ్యాయని, అలాగే చర్మ భాగంలో కూడా ఇన్‌ఫ్లమేషన్ (వాపు) కనిపించిందని తేలింది. బాధితుల్లో చాలా మందికి దీర్ఘకాలిక రోగనిరోధక చికిత్స అవసరమైందని నిపుణులు వెల్లడించారు. టాటూలు ఎక్కువగా వేయించుకునే దేశాల్లో కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

చర్మంపై వేసిన టాటూ (Tattoos) కళ్లను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చారు. టాటూలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపి, కంటిలోని సున్నితమైన భాగాలకు కూడా వ్యాపిస్తుంది. దీనివల్ల దృష్టి లోపాలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Read Also: మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>