Mobile Popup Ad
Mobile Popup Ad

ఉగాది వేడుకల్లో హరీశ్ రావు.. అనంతరం బాధితులకు పరామర్శలు

కలం, వెబ్ డెస్క్: ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్(Hyderabad) కోకాపేటలోని శ్రీ విశాఖ శారదా పీఠాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) దర్శించుకున్నారు. స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. ఉగాది పర్వదినాన తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని హరీశ్ రావు కోరారు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ప్రక్షాన రేవంత్ సర్కార్‌తో అనుక్షణం బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.

అనంతరం సిద్ధిపేట (Siddipet) జిల్లాలోని పలు బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం బక్రి చెప్యాల గ్రామానికి చెందిన చేర్యాల వెలుగు ఏపిఎం ఆంజనేయులు తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గ్రామ పార్టీ అధ్యక్షులు మధు ఇంటికి వెళ్లి పరామర్శించారు. తన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుకున్నారు. దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

అదే విధంగా గ్రామానికి చెందిన విద్యార్థి విభాగం మండల కో ఆర్డినేటర్ విజయ్ తండ్రి, పార్టీ మహిళా నాయకురాలు నర్సమ్మ భర్త రాజయ్య ఇటీవల అనారోగ్యానికి గురవ్వగా.. ఆయన్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మృతి చెందిన మలిదశ ఉద్యమ కారిణి, పార్టీ మహిళా అధ్యక్షురాలు గాడిచెర్ల నర్సమ్మ (టైగర్) (Gadicherla Nursamma) కుటుంబాన్ని హరీష్ రావు (Harish Rao) పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నర్సమ్మ మృతి ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పారు. నర్సమ్మ కుటుంబాన్ని అన్నివిధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు.

Read Also: ప్రభుత్వ విప్‌లను ప్రకటించిన రేవంత్ సర్కార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>