Mobile Popup Ad
Mobile Popup Ad

మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : ఉగాది పండుగ పర్వదీనాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పేదవారికి ఉచిత విద్యను అందించాలని తాను అనుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు నేడు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు తమిళ హీరో సూర్య ‘అగరం ఫౌండేషన్’ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు. ‘అగరం ఫౌండేషన్’ద్వారా సూర్య వందలాది మంది పేద విద్యార్థులను చదిస్తున్నారని కితాబిచ్చారు. తాను కూడా పేద ప్రజలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నానని.. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన, విధివిధానాల గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా తాను ప్రారంభించిన ‘బ్లడ్ బ్యాంక్’ ను ఇన్స్పిరేషన్‌గా తీసుకుని సూర్య ‘అగరం ఫౌండేషన్’ను (Agaram Foundation) ప్రారంభించారని చిరంజీవి తెలిపారు. ఈ విషయాన్ని తనతో పాటు అనేక బహిరంగ సభల్లోనూ సూర్య చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు అదే సూర్య నుంచి తాను స్ఫూర్తి పొంది తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ తాను ‘అందరివాడు’ అని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపించుకున్నారని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. దశాబ్దాలుగా ‘బ్లడ్ బ్యాంక్’, ‘ఐ బ్యాంక్’ ద్వారా లక్షలాది మందికి ప్రాణదాతగా నిలిచిన ఆయన, ఇప్పుడు అక్షర సాయంతో పేదరికంపై పోరాడేందుకు సిద్ధమయ్యారని ఆయన ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వర ప్రసాద్’ మూవీతో రీజినల్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం బాబీతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతున్న వేళ మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.మరోవైపు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అటు దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 157వ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది.

Read Also: ఘనంగా గద్దర్ అవార్డుల వేడుక.. సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>