నేటి నుంచి కొత్త ఐటీ పన్ను చట్టం అమలు

కలం, వెబ్ డెస్క్: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 (New IT Tax Law) అమల్లోకి వచ్చింది. ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో ఈ పన్నును తీసుకొచ్చారు. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగానే ఫైనాన్స్‌ చట్టం-2025ను నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) పెంపు, విద్య-వైద్యం నిమిత్తం విదేశాలకు పంపే మొత్తంపై పన్ను తగ్గింపు, విదేశీ విహార ప్యాకేజీలు.. ఇలా పలు కీలక నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే 2026 జులైలో దాఖలు చేసే ఐటీఆర్‌లు పాత చట్టం ప్రకారమే ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు వీలు కల్పించారు. 2026 జూన్‌ నుంచి చెల్లించే ముందస్తు పన్ను కొత్త చట్టం (New IT Tax Law) ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

Read Also: 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?.. కవిత ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>