కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండలంలోని వెంకటాపురం గ్రామపరిధిలోని మత్స్యగిరి (Mathsyagiri) లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా కొత్తపల్లి వెంకటయ్య మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. వెంకటయ్య ఇంతకుముందు సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పాలకుర్తిలో సూపరిండెంట్‌గా పనిచేస్తూ ప్రమోషన్ పొంది బదిలీపై వచ్చారు. ప్రస్తుతం మత్స్యాద్రి ఈవోగా పనిచేస్తున్న సల్వాది మోహన్ బాబుని అదనపు బాధ్యతల నుంచి తొలగించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈవో వెంకటయ్య మాట్లాడుతూ.. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయం మరింత అభివృద్ధి చెందేటట్లు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చక, సిబ్బంది వేద ఆశీర్వచనం, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read Also: ఇరాన్ కోచ్ ఆగ్రహం.. విశ్రాంతి కూడా ఇవ్వకుండా పంపించేశారు
Follow Us On: X(Twitter)

