కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన వేముల వీరేశం, ఎన్నం శ్రీనివాసరెడ్డి, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, బీర్ల ఐలయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కొత్త విప్‌లు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వీరితోపాటు కౌన్సిల్‌లో విప్‌లుగా నియమితులైన అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

