Mobile Popup Ad
Mobile Popup Ad

ఆరోగ్యశాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramarka) 2026-27 (Telangana Budget 2026)  వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ ఆరోగ్యశాఖకు రూ.13,679 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా, తెలంగాణ చరిత్రలో ఆరోగ్యశాఖకు ఇదే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. గత ఏడాది వార్షిక 2025–26లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12,393 కోట్లను కేటాయించింది. 2023–24లో బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరోగ్య‌శాఖకు రూ.12,161 కోట్లను కేటాయించింది.

ఈ పరిణామంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ఎంతగా ప్రాధాన్యతనిస్తుందో అర్థం అవుతోంది. అటు ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల, హెల్త్ కార్డుల ద్వారా ఉచిత వైద్యం ఖాళీల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>