కర్ర గణపతికి ఘన వీడ్కోలు.. వైభవంగా ఊరేగింపు

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్‌ లో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పట్టణ విశ్వబ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన కర్ర వినాయకుడికి (Karra Vinayaka) మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. నవరాత్రుల పాటు పూజలందుకున్న కర్ర గణపతిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ప్రతిష్టించి పట్టణ పురవీధుల గుండా వైభవంగా ఊరేగించారు. భాజా భజంత్రీలు, మహిళల మంగళహారతులు, భజన పాటల మధ్య సాగిన శోభాయాత్ర భక్తులను ఆకట్టుకుంది. అనంతరం బంగల్‌ పేట్ వినాయక సాగర్ వద్ద కర్ర గణపతిపై నీటిని చల్లి ఆలయంలో భద్రపరిచారు. ఈ శోభాయాత్రలో కర్ర పారిశ్రామిక సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>