కలం, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు గణేష్ మండపాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీపీ పాల్గొన్నారు. చైతన్యపురి, విద్యానగర్, ముకరంపుర, బోయవాడ, సిక్వాడ, టవర్ సర్కిల్, గాంధీ, కిసాన్‌నగర్, నాఖా చౌరస్తా ప్రాంతాల్లోని గణేష్ మండపాలను సీపీ సందర్శించారు. నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను, నిమజ్జన శోభయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

