నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు.. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్!

కలం, వెబ్ డెస్క్: నేపాల్‌ (Nepal) కు మళ్లీ వరద ముప్పు (Flood Threat) పొంచి ఉంది. దార్చులా (Darchula) జిల్లాలో భారీగా కొండ చరియలు విరిగిపడటంతో చౌలాని నది (Chaulani River) ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీనివల్ల నది ఉప్పొంగి వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు, నదీ పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు.

కాగా ఆగస్టు 26వ తేదీన నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక ప్రళయం అత్యంత ఘోరమైన విపత్తులలో ఒకటిగా నిలిచింది. ఈ ఆకస్మిక వరద వల్ల ఇప్పటి వరకు 1,300 మందికి పైగా మరణించగా 5,000 మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ విపత్తు నుంచి కోలుకోక ముందే మళ్లీ వరద ముప్పు అలర్ట్ (Nepal Flood Threat) రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Also Read : నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>