అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ, 2028 డిసెంబర్ నెలలో లేదా 2029 మార్చి నెలలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రోజున మళ్లీ ప్రజల తీర్పు కోరడానికి, పరీక్ష రాయడానికి మీ దగ్గరకే వస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

గత వెయ్యి రోజుల పదవీ కాలంలో తాము ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేశాననిని సీఎం తెలిపారు. దీనికి భిన్నంగా ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి, ఇంకొకాయన ఈ వెయ్యి రోజుల్లో ఒక్క రోజు కూడా బయటకు రాలేదని విమర్శలు గుప్పించారు.

తమ ప్రభుత్వానికి ఇంకొక రెండేళ్ల సమయం ఇస్తే నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ తాను ప్రజల అంచనాలను అందుకుని సమస్యలను పరిష్కరించలేకపోతే, రాబోయే రోజుల్లో తాము రాసే పరీక్షకు మార్కులు వేసే బాధ్యతను, తీర్పునిచ్చే హక్కును ప్రజలకే వదిలేస్తున్నానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు.

విద్యా వ్యవస్థలో తీసుకురాబోతున్న సంస్కరణలపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. నర్సరీ తరగతి నుంచి 12వ తరగతి వరకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉందని తెలిపారు. కొడంగల్ వేదికగా సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

Also Read : హామీలు చాలు.. సమస్యలు తీర్చండి : బండి సంజయ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>