కలం, వెబ్ డెస్క్: నేపాల్లో (Nepal) వరద విలయం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది శిథిలాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికీ కొంతమందిని బయటకు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నేపాల్లోని త్రిశూల్ 3A టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రెస్క్యూ బృందాలు తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు తీసుకొచ్చాయి. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా కబీర్ మహార్జన్, సంజయ్ షా టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా, నేడు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
టన్నెల్ లోపలి నుంచి ఇంకా పలువురి గొంతులు వినిపిస్తున్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. దీంతో అక్కడ మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకురావడానికి సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

