కలం, సోన్: సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కడెం మండలం పెద్దూర్ తాండకు చెందిన గుగ్లవత్ ప్రశాంత్ (30) నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంజారా హిల్స్ ప్రాంతంలో నివాసముంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ నెల మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ వైపు వెళ్తుండగా కడ్తాల్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించడంతో తిరిగి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే వివాహమైన ప్రశాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

