డీలిమిటేష‌న్‌కు స్టాలిన్ మ‌ద్ద‌తు.. ప్ర‌కాశ్ రాజ్ ఏమ‌న్నారంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) ఎక్స్ వేదిక‌గా ఓ రిక్వెస్ట్ చేశారు. డీలిమిటేష‌న్‌పై స్టాలిన్ తీసుకున్న నిర్ణ‌యంపై దేశ ప్రయోజనాల దృష్ట్యా మరోసారి పునరాలోచ‌న చేసుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు. అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు డీఎంకే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ విన్నపం చేశారు. ప్ర‌కాశ్ రాజ్‌తో పాటు ఇండి కూట‌మి నేత‌లు సైతం స్టాలిన్‌ను బుజ్జ‌గించే ప‌నిలో ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

న‌వంబ‌ర్ 30 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో నేడు చెన్నైలో పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో కేంద్రం తీసుకొచ్చిన సవరించిన డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని డీఎంకే అధికారికంగా తీర్మానించింది. ఈ సవరించిన ప్రతిపాదనలో డీఎంకే ప్రధాన డిమాండ్లు అన్నీ ఉన్నాయని స్టాలిన్ పేర్కొన్నారు. లోక్‌సభ స్థానాల్లో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న వాటాను అలాగే కొనసాగించడం, 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని యథాతథంగా ఉంచడం, అలాగే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా 50 శాతం సీట్లను పెంచుతూ రాబోయే 25 ఏళ్ల పాటు సీట్ల పంపిణీలో ఎలాంటి మార్పులు లేకుండా స్తంభింపజేయడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే డీఎంకే మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>