వినియోగదారులకు అన్యాయం జరిగితే కఠిన చర్యలు: జడ్జి అనురాధ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వినియోగదారుల హక్కుల పరిరక్షణ  తో పాటు వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని మహబూబ్ నగర్ వినియోగదారుల కమిషన్ (Consumer Commission) న్యాయమూర్తి అనురాధ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సదస్సులో భాగంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి అనురాధ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినియోగదారుల చట్టం ప్రకారం ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి స్పష్టమైన హక్కులు ఉన్నాయని ఆమె తెలిపారు. వినియోగదారుడు కొనుగోలు చేసిన వస్తువులో ఏదైనా సేవా లోపమున్న కమిషన్ (Consumer Commission) లో కేసు వేయొచ్చిన ఆమె పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదు పొందాలని, అప్పుడే వినియోగదారుడు తన హక్కుల పోరాడేందుకు అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. వస్తువును కొనుగోలు చేసిన రెండు సంవత్సరాల లోపు కేసు వేసేందుకు వీలుంటుందని, వినియోగదారుల చట్టం అమలు కాకపోతే తాము శిక్ష వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పారు.

వినియోగదారుల పక్షాన పోరాడుతామని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. జడ్చర్లలోని న్యూ చిగుళ్లపల్లి లింగాయ గుప్తా ఆయుర్వేద మందుల దుకాణంతో పాటు మినార్ రవ్వలో పురుగులు రావడంపై కమిషన్ లో పలు కేసులు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో తూనికలు కొలతల విషయంలో వినియోగదారులు చాలా మోసానికి గురవుతున్నారని, ఈ సందర్భంగా తూనికలు కొలతల అధికారి రవీందర్ దృష్టికి తీసుకువచ్చారు.

అంతేకాకుండా పట్టణంలోని హరి ఓం డైరీ, గిరిదారి షాపుల్లో పాల ఉత్పత్తులతో రోజుల తరబడి విక్రయిస్తున్నారని ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలత దృష్టికి ప్రవీణ్ తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలత ఆయా షాపులకు నోటీసులు ఇచ్చామని, శాంపిల్స్ ని సేకరించి హైదరాబాద్ కు పరీక్షల కోసం పంపించినట్లు ఆమె తెలిపారు. వినియోగదారులకు న్యాయం జరిగేవరకు కృషి చేస్తామని ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల కమిషన్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, నారాయణరెడ్డి, డీఎస్ఓ శ్రీనివాసులు, తూనికలు కొలతల అధికారి రవీందర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, ఆడమ్స్, బాలరాజు, సత్యనారాయణ రెడ్డి, దిడ్డి గోపాల్, కమిషన్ సిబ్బంది సృజన్, వినయ్, భాస్కర్ రెడ్డి, అంజాద్ అలీ, విజయ్ కుమార్ లతో పాటు పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.

Also Read : గీతా ఆర్ట్స్‌కు జ‌క్క‌న్న స‌ల‌హా.. యంగ్ ప్రొడ్యూసర్స్‌కు కౌంట‌ర్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>