Mobile Popup Ad
Mobile Popup Ad

మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తా: శ్రీరామ్ చక్రవర్తి

కలం, కరీంనగర్ బ్యూరో: మున్నూరు కాపు కుల సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని మున్నూరు కాపు కార్పొరేషన్ (Munnuru Kapu Corporation) చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ని జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల టౌన్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిట్ల రవీందర్, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో చైర్మన్ శ్రీరామ్ చక్రవర్తిని సన్మానించారు. చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ.. మున్నూరు కాపు కుల అభివృద్ధికి, యువత సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం టౌన్ అధ్యక్షులు చి ట్ల రవీందర్, ప్రధాన కార్యదర్శి తోట మల్లికార్జున్ ఉపాధ్యక్షులు అయ్యోరిసుధాకర్, వడ్నాల మహేష్, తీగల సూర్యప్రసాద్, సంయుక్త కార్యదర్శి గుగ్గిళ్ళ శేఖర్, ములాసపు ప్రభాకర్, ఏనుగుల రాజేందర్, కార్యదర్శి జంగిలి గోపి, న్యాయ సలహాదారులు పుప్పాల అశోక్, ముఖ్య సలహాదారులు మాజీ జిల్లా అధ్యక్షులు మున్నూరు కాపు సంఘంబాదినేని రాజేందర్, పిట్ట ధర్మరాజు, సిద్ధి దశరథం, కూతురి శేఖర్, కొలగాని రెడ్డి, కొలగాని శ్రీను, కార్యవర్గ సభ్యులు గోలి మల్లారెడ్డి, భారతపు గంగాధర్, మామిడి మల్లయ్య, బొక్కల నరసయ్య, అయ్యోరి రాజన్న, పాదం శంకర్, బూసి రాములు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>