దేశవ్యాప్తంగా ముగిసిన నీట్ యూజీ రీ ఎగ్జామ్‌

కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా నీట్ ( NEET) యూజీ రీ ఎగ్జామ్ ముగిసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాలలో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో 3.65 లక్షల మంది పరీక్షకు హాజరైన ఈ రీ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 5:15 గంటలకు ముగిసింది. అయితే దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6.20 వరకు పరీక్ష రాసేందుకు అనుమతి ఉంది.

నీట్ పరీక్ష లీకేజ్ వల్ల నిర్వహించిన ఈ రీ ఎగ్జామ్ పై అధికారులు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. లీకేజీలు, అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సీసీటీవీ నిఘా, జీపీఎస్ వాహనాలు, ఆధార్ బయోమెట్రిక్​ వెరిఫికేషన్ చేశాకే విద్యార్థులను లోపలికి పంపించారు. అయితే నీట్ యూజీ రీ ఎగ్జామ్ రాసేందుకు మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల తర్వాత విద్యార్థులను హాల్స్ లోకి అనుమతించమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. దీంతో కొన్ని చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష హాల్ లోకి అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆయా విద్యార్థులు బోరున విలపించారు. ఏడాదంతా చదివి పరీక్ష రాయలేకపోయామని కొందరు ఏడ్చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>