Mobile Popup Ad
Mobile Popup Ad

రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం: కేవీపీఎస్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు నియామకం చేయడంలో విఫలం చెందిందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ అన్నారు. కరీంనగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేవిపీఎస్ తెలంగాణ సామాజిక శిక్షణ తరగతులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిప్పరపు సురేష్ మాట్లాడుతూ.. జూన్ 28, 29, 30 తేదీలలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో రాష్ట్రస్థాయి సమాజం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దళితుల నిష్పత్రి ప్రకారం ఉన్నత స్థాయి ఉద్యోగాలలో కోట ప్రకారం నియామకాలు భర్తీ చేయడంలో విఫలం చెందిందని అన్నారు.

పార్లమెంటరీ స్టాండింగ్ రిపోర్ట్ ప్రకారం కేవలం మూడు శాతం మాత్రమే ఉద్యోగాలు నియామకం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు నేటికీ ఇంకా పారిశుధ్యరంగంలోనే ఉపాధి అవకాశాలు నియామకం జరుగుతుందని అన్నారు. సంక్షేమ పథకాలు అమలులో దళితులకు ఆర్థిక సహకారం ప్రభుత్వం అందించడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలం అయిందని అన్నారు. నేటికీ సమాజంలో కుల అనుచివేతలు సామాజిక వివక్షత దళితులపై గిరిజనులపై కొనసాగుతుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారి పోరాటాలకు ఈ శిక్షణ తరగతులు దోహదం కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవిపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి సాగర్, నగర కార్యదర్శి గాజుల కనకరాజ్, కేవిపీఎస్ నాయకులు మొలుగురీ రాజయ్య, దుర్గం ప్రజ్ఞ కుమార్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>