కలం, స్పోర్ట్స్ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) త్వరలోనే మైదానంలోకి దిగనున్నారు. మడమ గాయం నుంచి కోలుకోవడంతో రాబోయే రెండు వారాల్లో ప్రాక్టీస్, రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నారు. ఆగస్టులో జరిగిన శిక్షణలో ఆయన మడమకు గాయమైంది. దీంతో జపాన్ ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు దూరమయ్యారు. అంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, లుసాన్ డైమండ్ లీగ్‌లో రెండో స్థానం సాధించారు.
వైద్యుల సలహాతో విశ్రాంతి తీసుకున్న నీరజ్ (Neeraj Chopra) కు, ప్రముఖ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దీవాలా ప్రాక్టీస్‌కు అనుమతినిచ్చారు. క్లిష్ట సమయంలో సాయం అందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, టాప్స్ స్కీమ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్’ పథకాన్ని నీరజ్ స్వాగతించారు. దేశీయంగా క్రీడా పరికరాల తయారీ వల్ల అథ్లెట్ల సమస్యలు తీరుతాయని చెప్పారు.
Also Read : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ?
Follow Us On: Instagram

