బండి సంజయ్ సహకారంతో డంపు యార్డుకు రూ.17 కోట్లు: కొలగాని

కలం, కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో కరీంనగర్ డంపు యార్డు (Karimnagar Dump Yard) ప్రక్షాళనకు రూ.17 కోట్ల నిధులు తెచ్చామని మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. డంపు యార్డు సమస్య శాశ్వత పరిష్కారం కొసం తమ పాలకవర్గం తీస్కుంటున్న చర్యలను చూసి. కొంత మంది బండి సంజయ్ కు, తమ పాలకవర్గానికి ఎక్కడ పేరు వస్తుందోనని ప్రజల్లో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం 41వ డివిజన్ లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు.

కట్టరాంపూర్ లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ నాంపల్లి కవిత శ్రీనివాస్ తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన రూ. 12 లక్షల సాధారణ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు మేయర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. డివిజన్ కాలనీల్లో పాదయాత్ర చేపట్టి స్థానిక ప్రజల సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. ప్రజలు, కార్పోరేటర్ దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారంపై ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని మాట్లాడుతూ.. నగరంలో కొంత మంది నాయకులకు ఇంతకాలం డంపు యార్డు సమస్య, స్థానిక ప్రజల ఇబ్బందులు కనబడలేదని దుయ్యబట్టారు. తమ పాలకవర్గం డంపు యార్డు శాశ్వత పరిష్కారం కొసం రూ.17 కోట్లు నిధులు విడుదల చేసి బయోమైనింగ్ ప్రక్రియ చేపడుతుంటే.. బండి సంజయ్, తమ పాలకవర్గానికి ఎక్కడ పేరు వస్తుందోనని, ప్రజల్లో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

సోషల్ మీడియా వేదికగా విమర్శలు..

20 సంవత్సరాలు పదవుల్లో ఉండి ఏం చేయలేక.. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని మేయర్ తెలిపారు. మాటలు చెప్పడం కాదని.. తమ పాలకవర్గం ఒక ప్రణాళికతో గత 30 సంవత్సరాల డంపు యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అవసరాలను బట్టి మరిన్ని నిధులు కేటాయించైనా డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు.

కొంత మంది ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉండి కూడా డంపు యార్డు సమస్య పరిష్కారానికి ఏం చేయలేక పోయారని మేయర్ అన్నారు. స్వచ్చ్ బారత్ మిషన్ తో రూ.17 కోట్లతో బయోమైనింగ్ ప్రక్రియ చేపడుతామని తెలిపారు. అవసరం మేరకు మరిన్ని నిధులు కూడ కేటాయించి.. సాధ్యమైనంత తొందరలోనే స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని చెప్పారు. ఆ దిశగా తమ పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. ఇప్పటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేశామని.. త్వరలోనే బయోమైనింగ్ ప్రక్రియ పనులు ప్రారంభం చేస్తామన్నారు.

డంపింగ్ యార్డుకు రూ.80 కోట్లు..

అంతే కాకుండా డంపింగ్ యార్డుకు యూసీఎఫ్ స్కీంలో కూడా రూ.80 కోట్లు కేటాయించామని మేయర్ తెలిపారు. త్వరలోనే యూసీఎఫ్ టెండర్లు పూర్తి చేసి.. చెత్త ప్రాసెసింగ్ పనులను కూడ ప్రారంభం చేస్తామన్నారు. రెండు విధాలుగా డంపు యార్డులో ముమ్మరంగా పనులు చేసి.. డంపింగ్ యార్డును ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా తాము పని చేస్తున్నామని తెలిపారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ సలహాలు, సూచనలు పాటిస్తూ.. ప్రజలకు కావల్సిన వసతులు కల్పించి, వారి సమస్యలను తీర్చడం జరుగుతుందని తెలిపారు. 41వ డివిజన్ అభివృద్ధి కోసం యూఐడీఎఫ్ లో దాదాపు రూ.40 కోట్లు కేటాయించామని.. త్వరలోనే వాటి పనులు కూడా చేపట్టి డివిజన్ ను అందంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ లచ్చిరెడ్డి, ఏఈ భీంవర్ధన్ రెడ్డి, కాలనీవాసులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>