కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు (CJP Protest) కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో NDTA నిర్ణయం తీసుకుంది. జంతర్ మంతర్ పరిసరాల్లో పరిసరాల్లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (NDTA) సలహా జారీ చేసింది.
ఆ ప్రాంతంలోని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు గురువారం సాయంత్రం 6.30 గంటలకల్లా మూసివేయాలని సూచించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ఛైర్‌పర్సన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం 6.30 గంటలకల్లా అన్ని సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని NDTA కోరింది.
అయితే, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిరసనలు జరుగుతున్న ప్రాంతంలో భద్రతా దళాలు భారీగా మోహరించడం. రెస్టారెంట్లు, ఆఫీసుల సమయాల్లో పరిధి విధించడంతో సాయంత్రం 6.30 గంటల తరువాత ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది.

