మహిళా బిల్లుకు ఎన్డీఏ మాస్టర్ స్కెచ్.. విపక్షాలతో భేటీలు

కలం, నేషనల్ డెస్క్ : మహిళా బిల్లు ఆమోదం కోసం ఎన్డీయే (NDA) భారీ ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ప్రతినిధులతో మహిళా ఎంపీలు పలువురు కలిసి రిక్వెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న దశాబ్దాల ఆకాంక్ష ఇప్పుడు నెరవేరే సమయం ఆసన్నమైందని పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లుపై చర్చ జరగనున్నదని, సంపూర్ణ మద్దతు తెలిపి చట్టబద్ధత లభించేలా సహకారం అందించాలని ఇండియా కూటమి ఎంపీలకు ఎన్డీఏ (NDA)  కూటమికి చెందిన మహిళా ఎంపీలు రిక్వెస్టు చేయనున్నారు. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ కుట్రకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో ఎన్డీఏ మాస్టర్ స్కెచ్ వేసింది. మహిళా ఎంపీలతోనే విపక్షాల నోరు మూయించాలనుకుంటున్నది. సభలో నిరసనలు, వ్యతిరేకత లేకుండా చూసుకోవాలనుకుంటున్నది. మహిళా ఎంపీల ద్వారానే విపక్షాల ఆట కట్టించాలనుకుంటున్నది. మహిళా బిల్లుతో పాటే డీలిమిటేషన్ బిల్లు కూడా ఆమోదం పొందేందుకు మహిళా ఎంపీల ద్వారా ఎన్డీఏ విశ్వ ప్రయత్నాలకు ప్లాన్ చేసింది. ఎన్డీఏ కూటమి ఇలాంటి ప్లాన్ చేస్తుందని ముందుగానే తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కురుక్షేత్ర యుద్ధంలో శిఖండిని అడ్డం పెట్టుకుని లక్ష్యాన్ని నెరవేర్చుకున్నట్లుగా ఇప్పుడు మహిళా బిల్లును ముందు పెట్టి ఆ సాకుతో డీలిమిటేషన్ కుట్రకు బీజేపీ పాల్పడుతున్నదని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇప్పుడు ఇండియా కూటమి సమావేశంలో సైతం మహిళా బిల్లును తెరపైకి తెచ్చి డీలిమిటేషన్ బిల్లును దొడ్డిదారిన పాస్ చేయించుకోడానికి కేంద్ర ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతున్నదని విపక్ష నేత ఒకరు వ్యాఖ్యానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>