కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఎన్టీఏ కూటమి పార్టీల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో పాటు అందరూ కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా మోదీ ఈ రోజుతో నెహ్రూ రికార్డును అధిగమించారు.ఈ నేపథ్యంలో మోదీ ఘనతలపై ఎన్డీఏ కూటమి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించనుంది. అలాగే, ‘వికసిత్ భారత్`2047’ రోడ్ మ్యాప్, రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర పథకాలు, కార్యక్రమాలపై సమావేశంలో చర్చించబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరైన వారిలో ఉన్నారు.
Read Also: ‘ఝల్‌మురి’ ఆరగించిన మోదీ.. వడ్డించిన సీఎం
Follow Us On: Instagram

