కలం, వెబ్ డెస్క్ : ఆన్ లైన్ లో మెడిసిన్ అమ్మకానికి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులు మూతపడనున్నాయి. అఖిల భారత ఔషద వ్యాపారుల సంఘం బంద్ (Medical Shops Bandh) కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలోనూ మందుల దుకాణాలు రోజంతా బంద్ లో పాల్గొననున్నాయి. అయితే, ఆస్పత్రులకు అనుగుణంగా ఉన్న మెడికల్ షాపులు మాత్రం తెరిచే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందుల వినియోగదారులు ముందస్తుగానే మెడిసిన్ ను కొనుగోలు చేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్ సూచించింది.
ఆన్ లైన్ లో తక్కువ ధరకే మందులను అమ్మడం ద్వారా స్థానిక మెడికల్ వ్యాపారుల నష్టపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. డాక్టర్లు ఇచ్చే ప్రిస్కిప్షన్లు మిస్ యూజ్ అవుతున్నాయని.. డ్రగ్స్ కూడా విచ్చలవిడి అమ్ముతన్నారని చెబుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న డిస్కౌంట్లను నియంత్రించాలని, ధరల నియంత్రణలో నిబంధనలు పాటించకుండా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉంది.

