epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రేపట్నుంచి ఢిల్లీలో సీఎస్​ల జాతీయ సదస్సు

కలం, వెబ్​డెస్క్​: దేశ రాజధానిలో రేపట్నుంచి మూడు రోజుల (ఈ నెల 26–28) పాటు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదవ జాతీయ సదస్సు (National conference) జరగనుంది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్​ వేదికగా జరిగే ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తో సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల(సీఎఎస్)తోపాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు. వీరితోపాటు పాలనలో కీలకపాత్ర పోషించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవుతారు. వికసిత్​ భారత్​–2047 లక్ష్యాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడానికి ఈ సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు తీరును, భవిష్యత్​ సవాళ్లను ఉమ్మడి ఎదుర్కోవడానికి కేంద్రం ఏటా ఈ సదస్సు జరుపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>