చంద్రుడి చెంతకు నలుగురు వ్యోమగాములు.. వీడియో విడుదల

కలం, వెబ్ డెస్క్: చంద్రుడి వద్దకు మనుషులను పంపేందుకు నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ NASA) ఆర్టెమిస్-2 (Artemis 2) మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్ ద్వారా చంద్రుడి కక్ష్యలోకి నలుగురు వ్యోమగాములు విజయవంతంగా అడుగు పెట్టారు. తమ అద్భుతమైన అంతరిక్ష ప్రయాణ అనుభవాలను ఓ వీడియో సందేశం షేర్ చేశారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సవాళ్లు, అనంతమైన అంతరిక్షంలో భూమిని చూసినప్పుడు కలిగిన భావోద్వేగాలను వివరించారు. ఈ యాత్ర కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదని, అంతరిక్షం తమకు సహనం, సమన్వయం నేర్పిందన్నారు. ప్రకృతి అద్భుతాల పట్ల కొత్త దృక్పథాన్ని నేర్పిందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో మానవుడు చంద్రుడిపై స్థిరపడటానికి ఈ అనుభవాలు కీలక పాఠాలుగా మారుతాయని వ్యోమగాములు ఆ వీడియోలో తెలియజేశారు.

Read Also: పాకిస్థాన్‌లో 80 శాతం మంది స్వలింగ సంపర్కులే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>