Mobile Popup Ad
Mobile Popup Ad

వడదెబ్బ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: నారి ఐలయ్య

కలం, చండూరు: వడదెబ్బతో మృతి చెందిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వమే రూ.10 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య (Nari Ilayya) కోరారు. బుధవారం చండూరు మండలంలోని నెర్మట గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నారి ఐలయ్య మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండల వల్ల 47 మంది వ్యవసాయ కార్మికులు వడదెబ్బకు గురై మరణించారని చెప్పారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకొని, వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు కనీస వేతన జీవోను అమలు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయంలో పని చేసే కార్మికులందరికీ కనీస వేతనం సవరించి కొత్త జీవో తెస్తానని చెప్పార‌ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నేటికి రెండున్న‌రేళ్లు కావొస్తున్నా హామీ అమలుకు నోచుకోలేదద‌న్నారు.

ప్ర‌భుత్వం వెంటనే కనీస వేతన జీవోను సవరించి అమలు చేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్. డీజిల్ ధరలను ఇప్పటికే ఆరుసార్లు పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారం మోపిందని, దీంతో రకరకాల నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చక్రాన్ని తొలగించే కుట్రలో భాగంగా కొత్త ఉపాధి బిల్లును తీసుకొచ్చార‌ని మండిప‌డ్డారు. ఆ బిల్లుతో రాష్ట్రాలపై భారం పడుతుందని, కార్మికులు ఉపాధికి దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోల‌న వ్య‌క్తం చేశారు. వెంటనే ఆ బిల్లును ఉపసంహరించుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీలో 20 సంవత్సరాలుగా పని చేస్తున్న సిబ్బందిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ, వ్యవసాయ కార్మిక సంఘం చండూరు మండల కార్యదర్శి బల్లెం స్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, గుయ్యని పండు,నారపాక నరసింహ, కొత్తపల్లి నరసింహ, రాచమల్ల లక్ష్మయ్య,ఆర్.సైదులు జె. రాజు, నారపాక శంకర్, బురుకుల కృష్ణయ్య, బురకల నవీన్, బురకల నగేష్, లక్ష్మమ్మ, యాదయ్య, నరసింహ, అంజయ్య, దశరథ, వెంకన్న, సైదులు, శ్రీశైలం, పర్వతాలు, ఈ.నరసింహ, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>