Mobile Popup Ad
Mobile Popup Ad

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో 264 మంది పోకిరీల‌కు పోలీసుల ట్రీట్మెంట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి(Nampally)లో జ‌రిగిన నుమాయిష్‌ ఎగ్జిబిష‌న్‌ (Exhibition)లో 264 మంది పోకీరిల‌కు బుద్ధి చెప్పిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. వీరు ఎగ్జిబిష‌న్‌లో తిరుగుతూ మ‌హిళ‌ల‌ను వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్లు తెలిపారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 56 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా 52 మందికి కోర్టు రూ.1050 జరిమానా విధించింది. నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించిన‌ట్లు తెలిపారు. మ‌రో 188 మందికి పోలీసులు కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయిల ప‌ట్ల మ‌ర్యాద‌గా న‌డుచుకోవాల‌ని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>