‘స్త్రీ నిధి’ లక్ష్యాన్ని సాధించాలి: నారాయణపేట కలెక్టర్ ప్రియాంక

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సెర్ఫ్ పారా మీటర్లను మెరుగుపరచాలని నారాయణపేట (Narayanpet) జిల్లా కలెక్టర్ సీహెచ్‌.ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి స్త్రీనిధిపై సమీక్ష చేశారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని సీసీలకు సూచించారు. జిల్లాలోని బాలికల సంఘాల్లో ప్రతిభ కలిగిన అమ్మాయిలకు ఫొటోగ్రఫీ, కంప్యూటర్ శిక్షణ కోసం హైదరాబాద్ పంపించేలా చూడాలని డీఆర్డీఏ వెంకట్ రాములును ఆదేశించారు. త్వరలోనే జిల్లాకు హ్యాండ్ లూమ్ టెక్స్‌టైల్ కూడా రాబోతుందన్నారు. జిల్లాకు మంజూరైన షీ మార్ట్‌లో ఏయే ఉత్పత్తులు పెట్టాలో జాబితా తయారు చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌లో వారానికి ఒక రోజు (శుక్రవారం) మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

స్కూల్ యూనిఫాంలు రెడీ చేయించాలి..

జిల్లాలోని మండలాల వారీగా స్కూల్ యూనిఫాం కోసం వచ్చిన బల్క్ క్లాత్‌ను వెంటనే పంపించి, కుట్టు బాధ్యతను ఏపీఎంలు, సీసీలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్.ప్రియాంక ఆదేశించారు. మండలానికి ఒక మాస్టర్ ట్రైనర్ ఉంటారని యూనిఫాం కొలతల హెచ్చు తగ్గులను ఆయన సరి చేస్తారన్నారు. పాఠశాలల హెచ్ఎం, ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుని యూనిఫాంలు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, మున్సిపల్ కమిషనర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: భవిష్యత్​ తరానికి బంగారు బాటగా ఫ్యూచర్​ సిటీ: సీఎం రేవంత్​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>