కలం, వెబ్ డెస్క్: మే నెలలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు (Indian Railways) భారతీయ రైల్వే కీలక సమాచారాన్ని అందించింది. వివిధ రైల్వే జోన్లలో జరుగుతున్న నిర్వహణ పనులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కారణంగా దాదాపు 40 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు (Divert) అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ట్రాక్ ఆధునీకరణ, సిగ్నలింగ్ పనుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఉత్తర, తూర్పు రైల్వే మార్గాల్లో ప్రయాణించే వారికి కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే రైలు సమయాలను, రూట్లను సరిచూసుకోవాలని సూచించారు.
మళ్లించిన రైళ్ల జాబితాలో పలు సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ మార్పులు ప్రయాణ సమయాన్ని కొంత మేర పెంచవచ్చని, కొన్ని స్టేషన్లలో స్టాపింగ్‌లు కూడా రద్దు కావచ్చని రైల్వే శాఖ పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచారు.
దారి మళ్లించిన రైళ్లు ఇవే
బల్లియా-ఆనంద్ విహార్ స్పెషల్ (04055/04056), సూరత్ – ఛప్రా స్పెషల్ (09065/09066), బరౌనీ – గోండియా ఎక్స్‌ప్రెస్ (15231/15232) రైళ్లు ప్రస్తుతం దారి మళ్లించిన మార్గాల్లో నడుస్తున్నాయి. వీటితోపాటు లోకమాన్య తిలక్ – గోరఖ్‌పూర్ (11081/11082), శాలిమార్ – గోరఖ్‌పూర్ (15021/15022), వల్సాద్ – ముజఫర్‌పూర్ (19051/19052), కోటా – ఘాజీపూర్ సిటీ (22323/22324), ఛప్రా – ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ (15115/15116) సర్వీసుల మార్గాల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. మరికొన్ని ముఖ్యమైన రైళ్లు మౌ-ఆనంద్ విహార్ (22539/22540), సూరత్ – థావే (19045/19046), ఘాజీపూర్ సిటీ – వైష్ణో దేవి కత్రా (14611/14612), ఆనంద్ విహార్ – ఘాజీపూర్ సిటీ (22419/20420, 22433/22434), బాంద్రా టెర్మినస్ – ఘాజీపూర్ సిటీ (20941/20942) రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తున్నాయని రైల్వే శాఖ తెలిపింది.

