కలం, వెబ్ డెస్క్: దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ (YS Vijayamma) కు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) బర్త్ డే విషెస్ చెప్పడంపై లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) స్పందించారు. వైఎస్ఆర్ కుటుంబసభ్యులకు విషెస్ చెప్పే స్థాయి లోకేశ్‌కు లేదంటూ ఫైర్ అయ్యారు. అలాగే లోకేశ్‌కు అమ్మమ్మ వరసైన తనకు ఒక్కసారి కూడా బర్త్‌డే విషెస్ చెప్పలేదన్నారు. అసలు తన బర్త్‌డే ఎప్పుడో లోకేశ్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. లోకేశ్ ఒక పెద్ద మేధావిగా, లీడర్‌గా ఫీల్ అవుతున్నాడని, అతడికి అంత స్థాయి లేదని విమర్శించారు. విజయమ్మకు బర్త్‌డే విషెస్ చెప్పినట్లే తన మేనత్తలకు కూడా విషెస్ చెప్పాలని సూచించారు. అసలు లోకేశ్‌కు తన మేనత్తలు ఎక్కడున్నారో తెలుసా అని ప్రశ్నించారు. వాళ్ల పిల్లను ఆదుకోవడానికి ప్రయత్నించాలని చెప్పారు.
సొంత కుటుంబానికే ద్రోహం చేసే చంద్రబాబు, లోకేశ్ జగన్ కుటుంబాన్ని విమర్శిస్తారా? అని లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) ప్రశ్నించారు. వైఎస్ఆర్ కుటుంబంలో అన్నాచెళ్లెళ్లను విడదీసిన పాపం చంద్రబాబుదేనన్నారు. రోజు గొడ్డలి అంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ, సుప్రీం కోర్ట్ జగన్, భారతీలకు ఆ ఘటనతో సంబంధం లేదని చెప్పినా ఎందుకు ఇంకా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు ఇక్కడ భూములన్నీ కొనేశారని ఆరోపించారు. తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్లీ తిరిగి లోకేశ్ పేరు మీద రాయించుకున్నారన్నారు. తల్లిదండ్రులను కూడా లోకేశ్ ఇబ్బంది పెట్టారని చెప్పారు.
Read Also: తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?
Follow Us On : WhatsApp

