డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: లోకేశ్

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’(Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan) కార్యక్రమంపై మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పందించారు. మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనపై దేశవ్యాప్తంగా 100 వారాల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని జాతీయ ఉద్యమంగా విజయవంతం చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని లోకేశ్ కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ వ్యతిరేకంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరుతో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా ముందుకు రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>