కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఏనుగొండ (Yenugonda) అక్షర వీధిలో ఏర్పాటు చేసిన ప్రకృతి గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. భారీగా తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ మంగళవారం గణేషుడిని దర్శించుకున్నారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా గణపతి మండపాన్ని తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉండాలన్నారు. ప్రకృతిని పరిరక్షిస్తూనే అందరూ ఆనందంగా ఉండగలుగుతారన్నారు. ఈ సందర్భంగా అక్షర వీధి మిత్రబృందం మహిళలు ఆనంద్ కుమార్ గౌడ్‌ను సన్మానించారు.

