చండూరులో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

కలం, మునుగోడు : ప్రజాపాలన దినోత్సవాన్ని (Praja Palana Dinostsavam) పురస్కరించుకొని చండూరు మున్సిపల్ కార్యాలయంలో (Chandur Municipality) జాతీయ పతాకాన్ని చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం రాష్ట్ర చరిత్రలో ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగిన రోజని, ప్రజాస్వామ్య విలువలు, ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, మేనేజర్ జి.రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, వార్డ్ ఆఫీసర్లు జి.శ్రీరాములు, ఎ.జగన్, బి. సాయిరాం, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>