జగన్‌ సినిమా 11 రోజులు కూడా ఆడదు: లోకేశ్

కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు జగన్‌కు చూపించిన బ్లాక్‌బస్టర్ సినిమా సరిపోలేదేమో.. అందుకే పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తానని జగన్‌ అంటున్నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. జగన్‌ చూపిస్తానంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అసెంబ్లీలోని తన ఛాంబర్​లో మంత్రి మీడియాతో మాట్లాడారు. మరోసారి జగన్ (YS Jagan) తుగ్లక్ చర్యలు చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన అమరావతి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీలో అమరావతి తీర్మానం కోసం సమావేశం పెడితే వైసీపీ సభ్యులు హాజరుకాలేదని చెప్పారు. అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో పెట్టే అవకాశం ఉందని తెలిపారు. అక్కడైనా వైఎస్సార్సీపీ తన వైఖరి చెబుతుందో.. లేదో! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉన్న జగన్‌ను ఏరోజు ఏ ఆత్మ మాట్లాడిస్తుందోనని వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిపై ఉదయం 11 గంటలకు ముహూర్తం చూసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టామని వివరించారు. సభలో వైఎస్సార్సీపీ సభ్యుల చిత్తశుద్ధి ఏంటో వారి వైఖరితోనే తెలుస్తోందని మంత్రి విమర్శించారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>