వికటించిన విందు భోజనం​.. 41 మందికి అస్వస్థత

కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) లో ఫుడ్​ పాయిజన్ (Food Poison)​ కారణంగా 41 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి హల్దీ ఫంక్షన్​ విందు భోజనం వికటించడంతో పలువురికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో 9 మంది, సంగారెడ్డిలో జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులతో పాటు మిగతావారికి వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>