ఫ్లైట్ టికెట్టూ నాదే, మ్యాచ్ టికెట్టూ నాదే.. జగన్‌పై లోకేశ్ సెటైరికల్ ట్వీట్

కలం, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఇటీవల కొలంబోలో జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌కు లోకేశ్ వెళ్లడంపై ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ లోకేశ్ తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు. “ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్?” అంటూ లోకేశ్ ప్రశ్నించారు.

తన వ్యక్తిగత పర్యటనలకు సంబంధించిన ఖర్చులను తానే భరించానని, ప్రభుత్వ ఖజానా నుంచి పైసా కూడా వాడలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ (YS Jagan) ప్యాలెస్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ ‘సెటైరికల్ ట్వీట్’ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా స్టైల్‌లో లోకేశ్ (Nara Lokesh) సెటైర్లు వేయడంతో ఈ ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.

Read Also: ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>