Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

కలం, వెబ్ డెస్క్:  ఏపీ శాసనమండలి (AP Legislative Council)  రేపటికి వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీపై (Indapur Dairy) చర్చించాలంటూ వైసీపీ పట్టుబట్టింది. వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో మండలి చైర్మన్ రేపటికి వాయిదా వేశారు. హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ డెయిరీకి సంబంధాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. దేవదేవుడు అంటే అందరికీ భక్తి ఉంది. తిరుమల వెంకటేశ్వరస్వామికి అందరికి భక్తి ఉంది. ఇప్పుడు దేవుడి పేరుతో దోపిడీకి తెరలేపారు.

‘ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదలకు ఏం మేలు చేశారు. రైతులు, మహిళలు అందరూ ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం చూస్తున్నారు. హామీలు మొత్తం పక్కనపెట్టి.. వాటిని డైవర్షన్ చేసేందుకు కుట్ర పన్నారు.’ అంటూ బొత్స పేర్కొన్నారు.

‘హెరిటేజ్ సంస్థకు దోచి పెట్టేందుకే తిరుమల లడ్డును బయటకు తీసుకొచ్చారు. ఇందాపూర్ సంస్థను (Indapur Dairy) ముందుపెట్టి హెరిటేజ్ సంస్థలో దోపిడీకి తెరలేపారు. లడ్డు విషయంలో చంద్రబాబు అపచారం చేశారు. లడ్డు తినాలంటేనే భక్తులు భయపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.’ అంటూ బొత్స (Botsa Satyanarayana) విమర్శలు గుప్పించారు.

 Read Also: ఫ్లైట్ టికెట్టూ నాదే, మ్యాచ్ టికెట్టూ నాదే.. జగన్‌పై లోకేశ్ సెటైరికల్ ట్వీట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>