కలం, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ (CM Vijay) వరాల జల్లు కురిపించారు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేల కోసం భారీ ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున ఒక కారుతో పాటు లక్ష రూపాయలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇందులో పెట్రోల్ నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75,000 అందించనుండగా, ఎమ్మెల్యేలు తమ అధికారిక పనుల నిమిత్తం పీఏలను నియమించుకోవడానికి రూ.25,000 అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్లు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, నియోజకవర్గాల్లో పర్యటించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. సీఎం ప్రకటనపై అధికార పార్టీతో పాటు మిత్రపక్షాల ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు మాత్రం ఇది అనవసరమైన ఖర్చు అని మండిపడుతున్నారు.

