ష‌ర్మిల కుమార్తె పెళ్లి.. నారా లోకేశ్ విషెస్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల (YS Sharmila) కుమార్తె అంజిలీ రెడ్డి వివాహ వేడుక బెంగళూరులోని లీలా ప్యాలెస్‌లో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. సోమల రఘురామ్ రెడ్డితో అంజిలీ వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో కన్నుల పండుగ‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఫొటోలను గురువారం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీవెనలు, తల్లి ఆశీస్సుల మధ్య వివాహ వేడుక జరిగిందని పేర్కొంటూ, నూతన వధూవరులకు దేవుడి ఆశీస్సులతో పాటు తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

మరోవైపు ఈ వివాహ వేడుకపై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించారు. అంజిలీ, రఘురామ్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. నూతన దంపతుల జీవితాంతం ప్రేమ, ఆనందంతో ఉండాల‌ని ఆకాంక్షించారు. ఈ శుభ సందర్భంలో వైఎస్ షర్మిలకు (YS Sharmila), ఆమె కుటుంబ సభ్యులందరికు ఆయ‌న‌ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : రాయ‌ల‌సీమ లిఫ్ట్‌పై స్పందించిన‌ వైఎస్ జ‌గ‌న్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>