చంద్రబాబు కొత్తగూడెం పర్యటన.. స్వాగతం పలికిన తుమ్మల

​కలం, ఖమ్మం బ్యూరో: దాదాపు పుష్కర కాలం (12 ఏళ్లు) సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. కుటుంబ సమేతంగా జిల్లాకు వచ్చిన ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కలిసి పనిచేసిన ఈ ఇద్దరు సీనియర్ నేతల కలయిక జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ​

గురువారం సాయంత్రం కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు నాయుడు దంపతులు చేరుకున్నారు. వారికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala) స్వయంగా ఎదురెళ్లి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇరువురు నేతలు ఆత్మీయంగా పలకరించుకున్న అనంతరం, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్వంచ నవభారత్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనానికి బయలుదేరి వెళ్లారు.

​పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి (Chandrababu) రాక నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. పర్యటనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేదా ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. హెలిప్యాడ్ ప్రాంతం, కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో పోలీస్ బందోబస్తు, భద్రతా ప్రమాణాలను ఉన్నతాధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ప్రశాంతంగా సాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణ టీడీపీ శ్రేణులు చంద్రబాబును కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో స్థానిక పోలీసులపై వారు నిరసన వ్యక్తం చేశారు.

Also Read : తాజ్ మహల్‌పై వానర‌సేన దండయాత్ర.. వీడియో వైరల్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>