దున్నపోతు తోక నరికిన గుర్తుతెలియని వ్యక్తులు

కలం, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామంలో గురువారం మూగజీవిపై గుర్తుతెలియని వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. బుడమర్సు గ్రామానికి చెందిన రైతు కాశపోగు మద్దిలేటి దున్నపోతు (Buffalo) తోకను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేయడంతో స్థానికంగా కలకలం రేగింది. మూగజీవిపై ఇంతటి కిరాతకానికి పాల్పడిన వారిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దున్నపోతు తోకను నరికిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>