epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘నల్లమలసాగర్‌’పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

కలం, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Polavaram – Nallamala Sagar Project)కు వ్యతిరేకంగా తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణకు స్వీకరించదగిన అంశాలు ఈ పిటిషన్‌లో, అందువల్ల కొట్టివేస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఈ విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) స్వయంగా హాజరయ్యారు. కానీ సుప్రీంకోర్టు బెంచ్ మాత్రం రిట్ పిటిషన్‌కు విచారణ అర్హతే లేదని తేల్చి చెప్పి కొట్టివేస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి.. ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జలాల వివాదంలో అటు గోదావరి, ఇటు కృష్ణా బేసిన్‌లకు సంబంధించిన అంశాలు ఉన్నందున మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వాదనలను కూడా వినాల్సి ఉంటుందని, అందువల్ల సివిల్ సూట్ దాఖలు చేయాలని తెలంగాణకు సూచించింది.

రెండు మూడు రోజుల్లో సివిల్ సూట్ :

గత విచారణ సందర్భంగా మూడు సూచనలు చేసినా తెలంగాణ ప్రభుత్వం వాటిని స్వీకరించలేదు. పిటిషన్ విచారణకే మొగ్గు చూపింది. ఇప్పుడు సుప్రీంకోర్టు సూచనతో సివిల్ సూట్‌ను దాఖలు చేయనున్నది. ఇదే అంశాన్ని మంత్రి ఉత్తమ్ వివరిస్తూ.. రెండు మూడు రోజుల్లో న్యాయ నిపుణుల సలహా తీసుకుని నల్లమల సాగర్ ప్రాజెక్టు (Nallamala Sagar Project)ను వ్యతిరేకిస్తూ సూట్ వేస్తమని తెలిపారు. ఆ సూట్‌పై విచారణ జరిగే సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫు వాదనల అనంతరం సుప్రీంకోర్టు స్పష్టతకు రానున్నది. తెలంగాణకు చట్టబద్ధంగా, న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసమే లీగల్ పోరాటం చేస్తున్నామని మీడియాకు మంత్రి ఉత్తమ్ వివరించారు. నిజానికి ఏపీ ప్రభుత్వం చెప్తున్నదానికి, ఆచరణకు పొంతన లేదని ఆరోపించారు.

Read Also: సంక్రాంతి సెలవుల్లో కవిత.. కొత్త పార్టీపై సమాలోచనలు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>