Mobile Popup Ad
Mobile Popup Ad

స్పోర్ట్స్ స్కూల్ ఎంపికల్లో నల్లగొండ స్టూడెంట్స్ హవా

కలం, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ స్కూల్స్ (Sports School), హాస్టల్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపికల్లో నల్లగొండ (Nalgonda) జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. గత నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగిన తుది ఎంపికల్లో జిల్లాకు చెందిన 14 మంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించినట్లు జిల్లా యువజన క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్రాథమిక ఎంపికల అనంతరం, అబ్బాయిల విభాగం నుండి 10 మంది, అమ్మాయిల విభాగం నుండి 10 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లారు.

వీరిలో కఠినమైన ఫిజికల్ టెస్టులను దాటుకుని అబ్బాయిల విభాగంలో 8 మంది, అమ్మాయిల విభాగంలో 6 మంది ఎంపికయ్యారు. మొత్తం 14 మంది విద్యార్థులు రాష్ట్ర స్పోర్ట్స్ స్కూళ్లలో సీట్లు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఈ విద్యార్థులకు ఈ నెల 13, 14 తేదీల్లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులు తమకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్ణీత తేదీలలో కౌన్సిలింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని అక్బర్ అలీ సూచించారు.

Read Also: కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు స్టాలిన్ విజ్ఞప్తి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>