నకిరేకల్‌లో ప్రజా వికాస సభను జయప్రదం చేయండి: పున్న కైలాష్ పిలుపు

కలం, నకిరేకల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా పాలన 1,000 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుందని నల్గొండ డీసీసీ (Nalgonda DCC Chief) అధ్యక్షుడు పున్న కైలాష్ అన్నారు. రేవంత్ పాలనను పురస్కరించుకొని 5న నకిరేకల్‌లో నిర్వహించబోయే ప్రజా వికాస సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం నకిరేకల్‌లోని పార్టీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సారథ్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.

సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రూ. 21,000 కోట్ల మేర రైతు రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్, రైతు భరోసా అమలు చేస్తుందన్నారు. కొత్తగా 16 లక్షల రేషన్ కార్డులు, 2.50 లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్లను మంజూరు చేసి ఆదుకున్నామన్నారు. తెలంగాణను పదేళ్లపాటు దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్‌లు నేడు ప్రజా ప్రభుత్వంపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 2029లో కూడా మళ్లీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగొని రజిత శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు గాదగొని కొండయ్య, పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న, సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, యాస కరుణాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి భవ్య తేజ్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు వలిశెట్టి స్వప్న, కౌన్సిలర్లు గాజుల సుకన్య, కందాల బిక్షం రెడ్డి, బానోత్ వెంకన్న, పోతుల రవి, చెవుగొని లక్ష్మణ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>